జేఎన్‌ఏఎఫ్ వర్సిటీ ఇంచార్జి వీసీగా గంగాధర్
08-12-2024 02:06 AM
హైదరాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి ఇంచార్జి వీసీగా టి.గంగాధ ర్‌ను నియమిస్తూ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఎన్.శ్రీధర్ శనివారం ఉత్త ర్వులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వు లు వచ్చేంత వరకు ఆయనే వీసీగా కొనసాగనున్నట్లు పేర్కొన్నారు.
శుక్రవారం అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ వీసీ గా ప్రొ.ఘంటా చక్రపాణి, జేఎన్‌టీయూ హెచ్ ఇంచార్జి వీసీగా తెలం గాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.వి.బాలకిష్టారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విష యం తెలిసిందే. తాజాగా ఫైన్ ఆర్ట్స్ వర్సిటీకి ఇంచార్జి వీసీని నియమించడంతో రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకు వీసీల నియామకం పూర్తయ్యింది.




