4 June, 2026 | 3:20 AM

రూ.6 లక్షల గంజాయి పట్టివేత

04-06-2026 01:52 AM

భద్రాచలం, జూన్ 3 (విజయక్రాంతి): భద్రాద్రి జిల్లాలొ భారీగా గంజాయి పట్టుబడింది. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌ఐ సీహెచ్ శ్రీహరిరావు, సిబ్బందితో కలిసి కూనవరం నుంచి భద్రాచలం వెళ్లే రోడ్డులోని ఇసుక రీచ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వస్తున్న రెండు వాహనాలను ఆపి సోదా చేశారు.మొదటి వాహనంలో4.300 కిలోల ఎండు గంజాయి లభ్యమైంది. ఖమ్మం జిల్లాలోని మామిళ్లగూడెంకు చెందిన భానోత్ వీరేందర్, రమణగుట్టకు చెందిన గుత్తికొండ యశ్వంత్లు సీలేరు నుంచి ఖమ్మం జిల్లాకు గంజాయి తరలిస్తుండగా పట్టుబడ్డారు.

రెండో వాహనలో 5.200 కిలోల ఎండు గంజాయి లభ్యమైంది. ఖమ్మం జిల్లాలోని లెనిన్‌నగర్‌కు చెందిన షేక్ ఖాసీం, పాండురంగాపురానికి చెందిన షేక్ అమీర్లు సీలేరు నుంచి ఖమ్మం జిల్లాకు గంజాయిని తరలిస్తుండగా పట్టుబడ్డారు. మొత్తంగా రెండు వాహనాల్లో 9.500 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రెండు ద్విచక్ర వాహనాలు, రెండు సెల్‌ఫోన్లను సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల మొత్తం విలువ రూ.6.20 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజా యి, వాహనాలను స్టేషన్‌కు తరలించారు.