SGF అండర్-17 జోనల్ స్థాయికి గట్లమల్యాల విద్యార్థినుల ఎంపిక
19-09-2025 11:29 PM
నంగునూరు: మండల పరిధిలోని గట్లమల్యాల జెడ్పీహెచ్‌ఎస్ లో చదువుతున్న విద్యార్థినులు ఎస్జీఎఫ్ అండర్-17 జోనల్ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.ఇటీవల నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-17 బాలికల విభాగంలో పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి ఎం.గాయత్రి, 9వ తరగతి డి. అను,బి. ఈశ్వరి లు నంగునూరు మండల తరుఫున జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిబ సాధించి,జోనల్ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.విద్యార్థినులకు శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు రాజకుమార్ కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా విద్యార్థినులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. రమేష్,ఎస్‌ఎంసీ కమిటీ ఛైర్మన్ బి. సరోజన, ఉపాధ్యాయులు,గ్రామ ప్రజలు అభినందించారు.






