04-08-2025 07:29:07 PM
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలం(Valigonda Mandal)లోని పహిల్వాన్ పురం గ్రామానికి చెందిన గీతా కార్మికుడు వట్టిపల్లి సుధాకర్ గౌడ్ సోమవారం ప్రమాదవశాత్తు తాడిచెట్టు పైనుండి జారిపడి మృతి చెందాడు. కాగా మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గీత కార్మికులు కోరారు. ఈ సంఘటనపై స్థానిక ఎస్సై యుగంధర్ గౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.