calender_icon.png 5 August, 2025 | 12:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆశ్రమ పాఠశాలలో ప్రభుత్వం మెనూ తప్పనిసరిగా పాటించాలి

04-08-2025 09:06:58 PM

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐటిడిఏ పిఓ, హెడ్మాస్టర్లు ఇతర అధికారులు ఆదేశించిన కమిషనర్ వర్షిని

భద్రాచలం (విజయక్రాంతి): గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులను తమ సొంత పిల్లల్లా భావించి వారికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెనూ ప్రకారం తప్పనిసరిగా పౌష్టికారమైన ఆహారము సమయానుకూలంగా అందేలా హెచ్ఎం వార్డెన్లు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ అలుగు వర్షిని(Tribal Welfare Commissioner Alagu Varshini) సంబంధిత హెచ్ఎం లకు సూచించారు. సోమవారం నాడు ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయం నుండి ఐటిడిఏ పీవోలు, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారినిలు, డిటిడిఓలు, రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల హెచ్ఎం వార్డెన్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఖమ్మం జిల్లా కల్లూరులోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఉదయం అల్పాహారం తిని అస్వస్థకు గురి అయినందున దానికి సంబంధించిన కారణాలను అడిగి తెలుసుకుని ఇకముందు ఇటువంటి పరిణామాలు జరగకుండా చూడాలని అన్నారు. ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలలో ఫుడ్ కమిటీ సభ్యులుగా పిల్లలను నియమించాలని, నెలకు ఒకసారి ఫుడ్ కమిటీని మార్పులు చేయాలని, పిల్లలకు వడ్డించే ఆహారాన్ని సంబంధిత హెచ్ఎం వార్డెన్ మరియు ఉపాధ్యాయులు టెస్ట్ చేసి ఫుడ్ మంచిగా ఉందని సర్టిఫై చేసి 15 నిమిషాలు తర్వాత పిల్లలకు వడ్డించాలని, దానికి సంబంధించిన రిపోర్టు ఏ రోజుకి ఆ రోజు తనకు పంపించాలని అన్నారు. 

రాత్రిపూట మిగిలిన ఆహారాన్ని ఎప్పటికప్పుడు బయటపడే వేయాలని, వంటగది వంట చేసే సిబ్బంది శుభ్రత పాటించాలని, మెస్ కమిటీ సభ్యులు వార్డెన్ ఇచ్చిన సామానులను కరెక్ట్ గా చెక్ చేసుకోవాలని, మూడు రోజులకు ఒకసారి స్టోర్ రూమ్ లోని సామాన్లు చెక్ చేసుకోవాలని, జీసెస్ వారు సరఫరా చేసే సామాన్లు ఎక్స్పరి డేట్ అయిపోతే వెంటనే తీసివేయాలని, కూరగాయలను జాగ్రత్తగా భద్రపరచాలని, కొత్త మెనూ, సంబంధిత పిహెచ్సి డాక్టర్లు ఎస్సై తాసిల్దారులకు సంబంధించిన ఫోన్ నెంబర్లు పాఠశాల ముందు ప్రదర్శించాలని, హెచ్ఎం వార్డెన్లు ఎవరైనా సెలవు పెడితే తన దృష్టికి, అడిషనల్ సెక్రెటరీ దృష్టికి తీసుకొని వచ్చిన తర్వాతనే సెలవులు పెట్టాలని, ఎంహెచ్ఎం వార్డెన్ సిబ్బంది అందరూ ఐకమత్యంగా ఉండాలని, సంబంధిత హెచ్ఎంలు ఇన్స్టిట్యూషన్ మొత్తానికి బాధ్యత వహించాలని ఏదైనా ఇన్స్టిట్యూషన్లో పిల్లలు గనుక అస్వస్థతకు గురి అయితే వెంటనే జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో, సంబంధిత ట్రైబల్ వెల్ఫేర్ అధికారులకు, డిటిడివోలకు, పిల్లల తల్లిదండ్రులకు సమాచారం అందించాలని ఈ లోపల పిల్లలను దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో వైద్య చికిత్సలు చేయించాలని, గురుకులాలలో, ఆశ్రమ పాఠశాలల్లో ఏమైనా పోస్టులు ఖాళీగా ఉంటే ఈనెల 14వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని, పిల్లలకు మాత్రం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు. 

అనంతరం ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఐటీడీఏ పరిధిలో ఉన్న ఇన్స్టిట్యూషన్ కల్లూరులో మొదటిసారి జరిగిందని, హెచ్ఎం వార్డెన్ రిపోర్టు ప్రకారము కిచిడి సరిగా ఉడకలేదని అన్నారని, పిల్లలు అస్స్తస్థకు గురి అయిన విషయం తెలుసుకొని కల్లూరు సబ్ కలెక్టర్ మరియు తాసిల్దార్ వెంటనే వెళ్లి పిల్లలకు సకాలంలో వైద్య పరీక్షలు చేయించారని, పిల్లలకు ఎటువంటి ప్రమాదం జరగలేదని, ఇక ముందు గురుకులాలలో కానీ, ఆశ్రమ పాఠశాలలో కానీ వంట చేసే విషయంలో పొరపాట్లు దొరలకుండా జాగ్రత్తలు తీసుకునేలా ప్రిన్సిపాల్ హెచ్ఎం వార్డెన్ లకు ప్రత్యేక సమావేశం పెట్టి ఆదేశాలు జారీ చేస్తామని కమిషనర్ కు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఆర్ సి ఓ గురుకులం అరుణకుమారి, ఏటీడీవోలు అశోక్ కుమార్, చంద్రమోహన్, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు.