calender_icon.png 5 August, 2025 | 12:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెవిన్యూ అధికారులు న్యాయం చెయ్యాలి

04-08-2025 09:32:44 PM

చివ్వెంల: రెవిన్యూ అధికారులు తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న యలగబోయిన శ్రీరాములు వారి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితులు మేడేబోయిన రామయ్య, పుల్లయ్య, నాగరాజు కోరారు. సోమవారం ఉండ్రు గొండ గ్రామంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, యలగబోయిన శ్రీరాములు వారి కుటుంబ సభ్యులు తమ భూమిని అన్యాయంగా కబ్జా చేస్తున్నారని తెలిపారు. యలగబోయిన శ్రీరాములు భూమి సర్వే నెంబర్ వేరు మా భూమి సర్వే నెంబర్ వేరు మా సర్వే నెంబర్ భూమిని తనకు సంబంధం లేకపోయినా కబ్జా చేసుకుని స్తంభాలు పాతుకున్నాడని తెలిపారు. తమకు వారసత్వంగా వస్తున్న భూమి కాబట్టి రెవిన్యూ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి సర్వే చేయించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో దాసరి నాగేష్, లక్ష్మమ్మ, విజయ, సునీత, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.