calender_icon.png 5 August, 2025 | 12:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొలం బాట పట్టిన విద్యుత్ అధికారులు

04-08-2025 09:01:17 PM

మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని వెంకటపూర్ గ్రామంలో సోమవారం విద్యుత్ శాఖ అధికారులు పొలం బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఎస్ఈ జాడి ఉత్తమ్, డిఈ ఎంఎ కైసర్ లు మాట్లాడారు. రైతులకు విద్యుత్ మీటర్లకు కెపాసిటర్లు బిగించుకోవడం, వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో క్యాతనపల్లి ఏఈ ఏ ప్రభాకర్, లైన్ మెన్ సతీష్, మండల కాంగ్రెస్ నాయకులు కొట్టే సంపత్ కుమార్, గ్రామ రైతులు పాల్గొన్నారు.