04-08-2025 08:57:57 PM
హైదరాబాద్: మాదాపూర్ అయ్యప్ప సొసైటీ నందు గల శ్రీ చైతన్య విద్యాసంస్థల(Sri Chaitanya Educational Institutions) కేంద్ర కార్యాలయంలో ఈఎస్ఐ చందా చెల్లింపు చేయి కార్మికులకు సంస్థ అభ్యర్థన మేరకు కార్మిక రాజ్య భీమా సంస్థ(ESIC) మెడికల్ కాలేజ్ డీన్ శ్రీ డాక్టర్ సురేష్ కుమార్ చవాన్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాధిక - సనత్ నగర్ వార్ల సహకారంతో ఉచిత ఆరోగ్య క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ క్యాంపు నందు శ్రీ చైతన్య విద్యాసంస్థలలో పనిచేయుచూ నెలసరి ఈఎస్ఐ చందా చెల్లింపు చేయు కార్మికులకు, వారి పైన ఆధారపడిన కుటుంబ సభ్యులకు ESIC మెడికల్ కాలేజ్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు, ఇతర సిబ్బంది హాజరై వారికి మధుమేహం, రక్తపోటు, హిమోగ్లోబిన్, కంటి పరీక్షలు మరియు వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి తగు మందులను కూడా అందజేయడం జరిగింది.
ఈ విధంగా కార్మికుల వద్దకు ఈఎస్ఐ సిబ్బంది వచ్చి కార్మికులకు, వారిపైన ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఆరోగ్యపరిక్షా నిర్వహణ ఎంతో ఉపయుక్తంగా ఉన్నదని ఈ సందర్భంగా ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ డీన్ సురేష్ కుమార్ చవాన్ కి, హాస్పిటల్ సూపరింటెండెంట్ రాధికకు కార్మికుల తరఫున శ్రీ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ శ్రీ యలమంచిలి శ్రీధర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ క్యాంపులో సుమారు 300 మంది కార్మికులు హాజరై క్యాంపును జయప్రదం చేయడం జరిగిందని తెలిపారు.