04-08-2025 09:58:14 PM
జగదేవపూర్: తీగుల్ నర్సాపూర్ గ్రామానికి కొత్త పాఠశాల భవనం మంజూరు చేయాలని గ్రామ మాజీ సర్పంచ్ రజిత రమేష్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు స్వామిలు సోమవారం కలెక్టర్ హైమావతి(Collector Hymavathi)కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామంలో ఐదవ తరగతి వరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కొనసాగుతుండగా, పాఠశాలలో 33 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రస్తుతం పాఠశాల భవన్ పూర్తిగా శిథిలావస్థకు చేరిందన్నారు. ఓ మోస్తరు వర్షం కురిసిన తరగతి గదులలో స్లాబ్ నుండి వర్షం పడి తరగతుల నిర్వహించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాల భవనం ఎప్పుడు కూలిపోతుందోనన్న భయాందోళనకు గురవుతున్నారన్నారు. వీలైనంత త్వరగా కొత్త పాఠశాల భవనం నిర్మించడంతో పాటు పాఠశాలకు అవసరమైన మేరకు ఉపాధ్యాయులను కేటాయించాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేశామన్నారు.