calender_icon.png 4 August, 2025 | 11:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థాయికి మించి వైద్యం చేస్తే చర్యలు తప్పవు

04-08-2025 08:40:27 PM

ఆర్ఎంపీలను హెచ్చరించిన అధికారులు..

మహబూబాబాద్ (విజయక్రాంతి): ఆర్ఎంపీలు స్థాయికి మించిన వైద్యం చేస్తే చర్యలు తప్పవని, ప్రభుత్వ సూచనల ప్రకారం మాత్రమే వైద్య సేవలు కొనసాగించాలని, లింగ నిర్ధారణ పరీక్షలకు ప్రోత్సహిస్తే సహించేది లేదని అధికారులు హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్ఎంపి లతో జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవి రాథోడ్, డి.ఎస్.పి తిరుపతిరావు, సిడబ్ల్యుసి చైర్పర్సన్ నాగవాణి, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ నెహ్రూ అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ, ఇటీవల తమ తనిఖీల్లో పలుచోట్ల ఆర్ఎంపీ వైద్యులు స్థాయికి మించి వైద్యం చేయడం, కొన్ని సందర్భాల్లో అనధికారిక వైద్యం నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని తెలిపారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు అందుబాటులో ఉండి సహాయ సహకారం అందించిన ఆర్ఎంపీలు తమ మంచితనాన్ని అలాగే నిలుపుకోవాలని సూచించారు.  ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ప్రసాద్, రాజు, ఆర్.ఎం.పి వైద్యుల సంఘం ప్రతినిధులు రవీంద్ర చారి, నజీర్ అహ్మద్ పాల్గొన్నారు.