04-08-2025 08:47:50 PM
జిల్లా పౌరసంబంధాల అధికారి గౌస్..
ఖమ్మం (విజయక్రాంతి): కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పదవీ విరమణ సన్మానం పొందిన అనంతరం జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో సిబ్బంది సమక్షంలో పదవీ విరమణ పొందిన డ్రైవర్ బి. నర్సయ్యను జిల్లా పౌరసంబంధాల అధికారి గౌస్(District Public Relations Officer Ghaus), సిబ్బంది సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా పౌర సంబంధాల అధికారి మాట్లాడుతూ, బి. నర్సయ్య 1990 అక్టోబర్ 6న ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన నాటి నుండి నేటి వరకు అందరి మన్ననలు పొందుతూ, తమ విధులను సమర్ధవంతంగా నిర్వహించారని, వారు అందించిన సేవలతో జిల్లాలో సమాచార సేకరణ, మంత్రుల పర్యటన, జిల్లా కలెక్టర్, విఐపిల పర్యటనను విజయవంతంగా నిర్వహించామని అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డి పి ఆర్ ఓ ఆయుబ్, సిబ్బంది పాల్గొన్నారు.