calender_icon.png 4 August, 2025 | 9:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

సినిమా హీరోలను కాదు రియల్ హీరోలను ఆదర్శంగా తీసుకోవాలి

04-08-2025 07:32:07 PM

ఎన్ఆర్ఎస్ కాలేజీలో విద్యార్థులకు అవగాహన సదస్సు..

ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, సైకాలజిస్ట్ సుధీర్ సండ్ర..

కోదాడ: విద్యార్థులు సినిమా హీరోలను కాకుండా రియల్ హీరోలైన తల్లిదండ్రులు, టీచర్లు, దేశ క్షేమం కోసం కృషి చేసే సైనికులు, రైతులను ఆదర్శంగా తీసుకోవాలని ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, సైకాలజిస్ట్ సుధీర్ సండ్ర(Psychologist Sudheer Sandra) అన్నారు. సోమవారం పట్టణంలోని ఎన్ఆర్ఎస్ కాలేజీలో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, పేరెంట్స్ మీటింగ్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మానవ జీవితంలోనే విద్యతోనే ఉన్నత స్థానాలు, మర్యాద, గౌరవం లభిస్తాయన్నారు.

విద్యార్థులు ఇంటర్మీడియట్ నుండి 6 సంవత్సరాల పాటు కష్టపడితే వారి జీవిత గమనం సాఫీగా సాగుతుందని తెలిపారు. ఇంటర్మీడియట్ స్థాయిలో విద్యార్థులు ఆకర్షణలకు లోను కాకుండా, ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని సాధించేందుకు కష్టపడాలని కోరారు. కాలేజీ చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి మాట్లాడుతూ తమ కాలేజీ లో విద్యార్థులకు చదువు పై ఇష్టాన్ని పెంచే విధంగా విద్యా బోధన చేస్తున్నామని తెలిపారు. కాలేజ్ చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి, డైరెక్టర్ మనోహర్ రెడ్డి, కరస్పాండెంట్ వేణుగోపాల్, వైస్ ప్రిన్సిపాల్ జీ. వీ, అకడమిక్ డైరెక్టర్ మైనం రామయ్య పాల్గొన్నారు.