25-10-2025 12:36:07 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 24(విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ శాఖలో పనిచేస్తున్న రెగ్యులర్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం హౌసింగ్ సొసైటీ ద్వారా సేకరించిన స్థలంలో నూతన ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం అన్ని రకాల, సహాయక చర్యలు అందించేలా కృషి చేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షుడు ఊదారి గోపాల్, జనరల్ సెక్రటరీ నర్సింగ్ రావులు పేర్కొన్నారు.
ఈ మేరకు, యాదాద్రి జిల్లా చెల్లూరు గ్రామంలో, సర్వే నెంబర్ 322లో, 220, ఎకరాల స్థలంలో, నూతన ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు, ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు ఊదారి గోపాల్, నర్సింగ్ రావు వర్కింగ్ ప్రెసిడెంట్ బి.కన్నా లు, ఉపాధ్యక్షులు కే సురేష్, ఔట్‌సోర్సింగ్ అధ్యక్షులు రవీందర్, జనరల్ సెక్రటరీ వీ సంజీవ్, ఎల్బీనగర్ జోన్ అధ్యక్షులు హనుమంతరావులు, హాజరయ్యారు,ఈ సంద ర్భంగా వీరిని రెగ్యులర్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఘనంగా సత్కరించారు.
అనంతరం, గోపాల్,నర్సింగరావు,బి కన్నలు మాట్లాడుతూ సొంతిల్లు లేని ఉద్యోగులకు తాము హౌసింగ్ సొసైటీ ద్వారా స్థలాన్ని సేకరించామన్నారు. ఈ స్థలంలో నిర్మించబోయే ఇళ్ల కోసం ప్రభుత్వం ఉచితంగా రోడ్లు, విద్యుత్, మంచినీటి పైప్‌లైైన్ నిర్మాణాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.ఈ విషయాన్ని త్వరలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో రెగుల్యర్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.