25-10-2025 12:34:34 AM
- ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ టౌన్, అక్టోబర్ 24 (విజయ క్రాంతి): ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కు నూతన వస్త్రాలు అందజేసిన శుభాకాంక్ష లు తెలిపిన విప్.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజలకు పక్క ఇల్లు ఉండాలని సంకల్పంతో ముందు కు సాగుతున్నారు. రాష్ట్రంలో రాజకీయాలకు పార్టీలకు అతీతంగా పేద ప్రజలకు ఇందిర మ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నాం ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు చేశాం వేములవాడ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయి ఇళ్లు లేని వారికి గూడు కల్పించడం కోసం ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తుంది.దేశ వ్యాప్తంగా ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు కేవలం ఒక్క తెలంగాణ రా ష్ట్రంలో మాత్రమే ఇస్తున్నాం పేదల స్వంత ఇంటి కల నేడు ప్రజా ప్రభుత్వంలో నెరవేరుతుంది.గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తానని మోసం చేసింది.
పట్టణంలో గ్రామాల్లో పండగ వాతావరణం లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కొన సాగుతున్నాయి.ఇప్పటికే కొందరికి బేస్మెంట్ లెవెల్ పూర్తయి, కొందరికి స్లాబ్ దశలో ఉండి తమ తమ ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిధులు జమ చేయడం జరుగుతుంది.నిస్సహాయులకు సహాయాన్ని అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుం ది.లబ్ధిదారులు మాటలు చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. గతంలో పూరి గుడిసె ల్లో రేకుల షెడ్లల్లో నివసించే వారమని ప్రజా ప్రభుత్వం లో ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు మంజూరు అయ్యిందని సంతోషంగా చెప్తున్నారు.
పేదలకు నాడు ఇందిరమ్మ ఇల్లే నేడు కూడా మళ్లీ ఇందిరమ్మ ఇల్లే .ఆనాడు ఇందిరమ్మ పేద ప్రజల కోసం ఆలోచించి ఇందిర మ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టారు.ప్రజా సంక్షే మం కోసం రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోంది. నూతన రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇళ్ళు, సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం.తెలంగాణ దేశానికి ఒక రోల్ మోడెల్ గా నిలుస్తుంది.