25-10-2025 12:36:57 AM
ఎస్పీ నరసింహ
సూర్యాపేట, అక్టోబర్ 24 (విజయక్రాంతి) : రక్తదానం ప్రాణదానం తో సమానం అని జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఖమ్మంకు చెందిన సికిల్ సెల్ సొసైటీ సమక్షంలో తల సేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లల కోసం రక్తాన్ని సేకరించినట్లు తెలిపారు.
పోలీసుల త్యాగాలు బలిదానాలను ప్రజలు గుర్తించాలని శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులతో భాగస్వామ్యం కావాలన్నారు. ఈ రక్తదాన శిబిరానికి పెద్ద ఎత్తున యువత తరలివచ్చి రక్తదానం చేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఆర్ అదనపు ఎస్పీ జనార్ధన్ రెడ్డి, డీఎస్పీ నరసింహా చారి, సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్, పోలీసు సంఘం అధ్యక్షులు రామచందర్, ఆర్ ఎస్త్స్రలు అశోక్, సురేష్, రాజశేఖర్, సాయిరాం, ట్రాఫిక్ ఎస్‌ఐ సాయిరాం, సిబ్బంది పాల్గొన్నారు.