calender_icon.png 26 May, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రింగ్ రోడ్డు వరకు జీహెచ్‌ఎంసీ విస్తరణ?

26-05-2025 12:34:48 AM

- కసరత్తు చేస్తున్న సర్కారు 

-ఓఆర్‌ఆర్ బయట మున్సిపాలిటీ లలోనే డీ లిమిటేషన్ 

-మేడ్చల్ జిల్లాలో 9 మున్సిపాలిటీలు, నాలుగు నగరపాలక సంస్థలు విలీనం 

మేడ్చల్, మే 25(విజయ క్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించడానికి ప్ర భుత్వం సన్నాహాలు చేస్తోంది. ఓ ఆర్ ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీలలో డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టడం లేదు. కేవలం ఓ ఆర్ ఆర్ బయట ఉన్న మున్సిపాలిటీలలోనే డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుంది.

దీనిని బట్టి ఓఆర్‌ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీలు, న గరపాలక సంస్థలు జిహెచ్‌ఎంసి లో విలీనం కానున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలో కొన్ని కొత్త మున్సిపాలిటీలు ఏ ర్పాటు చేసింది. కొన్నిచోట్ల మున్సిపాలిటీ లు, నగరపాలక సంస్థలకు దగ్గరలో ఉన్న గ్రామాలను విలీనం చేసింది.

కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, గ్రామాలు కలిసిన మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలలో డీ లిమిటేషన్ ప్రక్రియ చేపట్టింది. ఇందుకు స్పెషల్ ఆఫీసర్లను కూడా నియమించింది. ఔటర్ రింగ్ రోడ్డు బయట ఉన్న మున్సిపాలిటీలలో మాత్రమే డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతోంది.

మేడ్చల్ జిల్లాలో ఎల్లంపేట, అలియాబాద్, మూడు చింతలపల్లి మున్సిపాలిటీలలో వార్డుల విభజన చేస్తున్నారు. ఓటర్ల సంఖ్య ఆ ధారంగా వార్డులు ఖరారు చే స్తున్నారు. అన్ని వార్డులకు స మానంగా ఓటర్లను విభజిస్తున్నారు. ఎల్లంపేట మున్సిపాలిటీ లో ఒక్కో వార్డులో సుమారు 900 మంది ఓటర్లు ఉండేలా వార్డులు విభజిస్తున్నారు. 

మేడ్చల్ జిల్లాలో మూడు మినహా అన్ని జిహెచ్‌ఎంసి పరిధిలోనే......

మేడ్చల్ జిల్లా ఇటీవల అర్బన్ జిల్లాగా ఆవిర్భవించింది. గతంలో 61 గ్రామపంచాయతీలు, ఐ దు మండలాలు ఉండేవి. వీటన్నింటినీ పురపాలక పరిధిలోకి తీసుకోవచ్చారు. కొన్ని గ్రామాలను సమీప మున్సిపాలిటీలలో విలీనం చేశారు. కొత్తగా మూ డు మున్సిపాలిటీలు ఏర్పాటు చేసి మిగతా గ్రామాలను వీటిలో విలీనం చేశారు.

కొత్తగా ఏర్పాటు అయిన ఎల్లంపేట, అలియాబాద్, మూడు చింతలపల్లి మున్సిపాలిటీలు మాత్ర మే జిహెచ్‌ఎంసిలో కలవడం లేదు. ఇవి కూడా జిహెచ్‌ఎంసిలో కలుస్తాయని ప్రచా రం జరిగింది. కొత్తగా మున్సిపాలిటీలు ఏ ర్పాటుపై అసెంబ్లీలో బిల్లుఆమోదం పొందడమే గాక, ప్రభుత్వం గెజిట్ కూడా విడుదల చేసింది. కానీ జీవో జారీ చేయలేదు.

చాలా రోజులుగా జీవో జారీ చేయకపోవడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుండడంతో జిహెచ్‌ఎంసిలో కలువబోవని తెలుస్తోంది. జిల్లాలో మిగతా నిజాంపేట్, పీర్జాదిగూడ, జవహర్ నగర్, బోడుప్పల్ మున్సిపల్ కా ర్పొరేషన్లు, మేడ్చల్, గుండ్ల పోచంపల్లి, దుండిగల్, కొంపల్లి, తూముకుంట, నాగా రం, దమ్మాయిగూడ, ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీలు జిహెచ్‌ఎంసిలో విలీనం కానున్నాయి. జిహెచ్‌ఎంసి పాలకవర్గం గడువు ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఉంది. మున్సిపాలిటీల పాలకవర్గం గడువు ముగియగా, ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. 

జిహెచ్‌ఎంసి పై కొనసాగుతున్న సస్పెన్స్ 

జిహెచ్‌ఎంసి ఒకటిగానే ఉంటుందా, మూడుగ విభజిస్తారా అనే అంశంపై సస్పె న్స్ కొనసాగుతోంది. దీనిపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఒక ఐఏఎస్, ఐపీఎస్ కు బాధ్యతలు అప్పగించింది. వీరు ఇటీవల సమావేశమై ఓఆర్‌ఆర్ వరకు ఉన్న మున్సిపాలిటీలను, నగర పాలక సంస్థలను విలీనం చేసే అంశంపై, ఇందుకు ఎదురయ్యే న్యాయపరమైన చిక్కుల గురించి చర్చించినట్లు తెలిసింది. వీరు ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునేఅవకాశంఉంది.