04-07-2025 01:41:42 AM
కమిషనర్ ఆర్‌వీ కర్ణన్
హైదరాబాద్ సిటీబ్యూరో జూలై 3 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ పరిధిలోని వాహన మరమ్మతు షెడ్‌లు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండాలని కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కవాడిగూడలోని వాహనాల మరమ్మతు షెడ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. వాహనాల మరమ్మతులను త్వరితగతిన పూర్తిచేసి, వాటిని వినియోగంలోకి తేవాలని స్పష్టం చేశారు. అలాగే, ఖైరతాబాద్‌లోని వాహన పార్కింగ్ షెడ్ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.
మొబైల్ టాయిలెట్ వాహనాల విషయంలోనూ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వాటిని వెంటనే రిపేర్ చేసి, అవసరమైన సమయాల్లో వాడుకలోకి తీసుకురావడానికి తగిన చర్యలు తీసుకోవాలని అ ధికారులకు సూచించారు. తనిఖీల్లో కమిషన ర్ వెంట అదనపు కమిషనర్ ట్రాన్స్‌పోర్ట్ ర ఘు ప్రసాద్, జోనల్ కమిషనర్ రవికిరణ్, విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.