04-07-2025 06:20:46 PM
హైదరాబాద్: హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం(LB Stadium)లో సామాజిక న్యాయ సమరభేరి సభ(Social Justice Samara Bheri Sabha) జరిగింది. ఈ సభకు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే(Mallikarjun Kharge), కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సభలో 40 వేల మందికి పైగా కాంగ్రెస్ శ్రేణులు హాజరయ్యారు. సభ వేదిక వద్ద కళాకారులు ఆటపాటలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కార్యకర్తలే కారణమన్నారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క అందరూ కలిసికట్టుగా పని చేసి కేసీఆర్ ను ఓడించి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని చెప్పారు. గతంలో రైతులను, మహిళలను నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారని ఖార్గే పేర్కొన్నారు.
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) హైదరాబాద్ కు చేసిందేమిలేదని అంతా శూన్యమని, ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా(Union Minister Amit Shah) దేశ ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదలకు సన్న బియ్యం అందిస్తోందని, రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో రూ.8,200 కోట్లు జామ చేసిందని హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీలను ఇవ్వడామే కాకుండా చెప్పినట్లుగా చేసి చూపించిందని కొనియాడారు. గిగ్ వర్కర్ల హక్కుల కోసం కూడా తెలంగాణ ప్రభుత్వం చట్టం తీసుకువస్తోందని, దేశంలోనే తొలిసారి కులగణన చేపట్టిందని తెలంగాణ ప్రభుత్వమే. బీసీల రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ పని చేస్తోందని ఖర్గే తెలిపారు.
దేశ ఆర్థిక పరిస్థితిని ప్రధాని మోదీ చిన్నాభిన్నం చేశారని, ఆపరేషన్ సింధూర్ కు రహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. అఖిలపక్ష సమావేశానికి మాత్రం మోదీ రాలేదని, బిహార్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని ఆయన మండిపడ్డారు. అదీ మోదీ దేశభక్తి.. అదీ మోదీ ఆలోచనా విధానం అని ఎద్దేవా చేశారు. ఇప్పటికి మోదీ 42 దేశాలు తిరగారు.. కానీ ఇంత వరకూ మణిపుర్ వెళ్లడానికి మాత్రం మనసు రాలేదని, మణిపుర్ అంశంపై ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పెదవి విప్పలేదని ఖార్గే విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ, తను కూడా మణిపుర్ వెళ్లాం.. కానీ మోదీ వెళ్లలేదన్నారు. మణిపూర్ ఈ దశంలో భాగం కాదా.. మణిపూర్ వాసులు భారతీయులు కాదా..? అని ప్రశ్నించారు.
మోదీజీ.. ముందు దేశ ప్రజల బాధలు వినండి.. తర్వాత విదేశాల సంగతి చూడవచ్చన్నారు. పాకిస్థాన్ తో యుద్ధం చేయాలని మేమంతా ఆపరేషన్ సింధూర్ కు మద్దు ఇచ్చామని, మరి మోదీ ఎందుకు యుద్ధాన్ని మధ్యలోనే ఎందుకు ఆపేశారని ఈ సందర్భంగా మల్లి ఖార్జున్ ఖార్గే అడిగారు. ట్రంప్ ఫోన్ చేయగానే మోదీ యుద్ధం ఆపారు... కానీ ఆ విషయంపై మాత్రం మోదీ నోరువిప్పలేదని ఫైర్ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్థాన్ భయపడిందని మోదీ చెప్పారని, మరి ఎందుకు ఆపరేషన్ ఆపేశారు..? అని ప్రశ్నించారు. దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నుంచి ఒక్కరైనా ప్రాణాలు అర్పించారా..? అని అడిగారు. గతంలో ఇందిరాగాంధీని అమెరికా బెదిరించినా ఆమె భయపడలేదని గుర్తు చేశారు. అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేసి మరీ ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ ఏర్పాటుకు సహకరించారని మల్లిఖార్జున ఖర్గే చెప్పారు.