04-07-2025 01:39:50 AM
తెలంగాణ ఎరుకల ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడు కెమసారం తిరుపతి
ముషీరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై ఏకలవ్య విగ్రహానికి స్థలం కేటాయించి, విగ్ర హం ఏర్పాటు చేయాలని తెలంగాణ ఎరుకల ప్రజా సమితి(టీవైపీఎస్) రాష్ట్ర అధ్యక్షు లు కెమసారం తిరుపతి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏకలవ్య జయంతిని పురస్కరించుకుని ఏకలవ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం తిరుపతి మాట్లాడుతూ రాష్ట్రం లో దాదాపు 6 లక్షల మంది జనాభా కలిగి ఉన్న ఎరుకలు ప్రపంచంలో ఒక చరిత్ర గల వ్యక్తి ఏకలవ్యుడని అన్నారు. ఏకలవ్య జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిం చాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో ఏకలవ్య విగ్రహాలను ఏర్పాటు చేయాలన్నారు. ఏకలవ్య జయంతి ఉత్సవాలకు ప్రతి జిల్లాకు రూ.1లక్ష బడ్జెట్ కేటాయిం చాలని కోరారు.
ఏకలవ్య అవార్డులను ప్రభుత్వం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎరుకల ప్రజా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ఉపేందర్, ఉపాధ్యక్షులు ఉండాడి అంజ య్య, మానుపాటి శ్రీనివాస్, సంపత్, సహా య కార్యదర్శులు రేవెల్లి తిరుపతి, ఉండాడి వెంకటేష్, నడిగడ్డ కుమారస్వామి, రాష్ట్ర నాయకులు లోకిని పోచయ్య, ఎల్లయ్య, సార్ల తిరుపతి, సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ మొగిలి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.