calender_icon.png 5 July, 2025 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు భరోసా పథకం ద్వారా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశాం: భట్టి

04-07-2025 06:49:27 PM

హైదరాబాద్: హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయ సమరభేరి సభ జరిగింది. ఈ సభకు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సభలో 40 వేల మందికి పైగా కాంగ్రెస్ శ్రేణులు హాజరయ్యారు.

సభ వేదిక వద్ద కళాకారులు ఆటపాటలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలోని 44 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,180 కోట్లతో బీమాను రైతు భరోసా పథకం(Rythu Bharosa Scheme) ద్వారా నిధులు జామా చేశామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా రూ.12 వేలు ఇస్తున్నామని, చేయూత పథకం ద్వారా రూ.17 వేల కోట్లు పంపణీ చేసినట్లు తెలిపారు. పేదలకు రూ.500 కు గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని భట్టి విక్రమార్క వెల్లడించారు.