09-07-2025 12:08:58 AM
ఎల్బీనగర్, జులై 8: అండర్- 13 డబుల్స్ విభాగంలో నేషనల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైన పొద్దుటూరి అన్య, వైభవ్ రమ్యను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మేడ్చల్ - మల్కా జ్ గిరి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా అభినందించారు. నాగోల్ లోని తన నివాసంలో మంగళవారం క్రీడాకారులను సన్మానించి, రూ, 10వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు.
ఈ సందర్భగా ఆయన మాట్లాడు తూ... జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన సమాజానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. క్రీడాకారులకు ఉప్పల ఫౌండేషన్ ఆసరాగా ఉం టుందని తెలిపారు. కార్యక్రమంలో మేడ్చల్ -మల్కాజ్ గిరి జిల్లా బ్యా డ్మింటన్ అసోసియేషన్ కోశాధికారి హర్ష, క్రీడాకారుల తల్లితం డ్రులుపాల్గొన్నారు.