calender_icon.png 29 August, 2025 | 2:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదాద్రిలో ఘనంగా గిరి ప్రదక్షిణ

29-08-2025 12:27:58 PM

యాదగిరిగుట్ట,విజయక్రాంతి: యాదగిరిగుట్ట శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో(Yadadri Lakshmi Narasimha Swamy) స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి సందర్భంగా ఘనంగా గిరిప్రదక్షిణకు(Giri Pradakshina ) ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. గిరి ప్రదక్షణ సందర్భంగా వేల సంఖ్యలో స్వామివారి భక్తులు స్వామి వారి పాదాల వద్ద గల గోపురం నుండి స్వామివారి కొండ చుట్టూ ప్రదక్షణ చేసి తిరిగి పాదాల వద్ద నమస్కరించుకొని దర్శనార్థం మెట్ల మార్గం గుండా వెళ్లడం జరిగింది. స్వామివారికి ఆనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం గిరి ప్రదక్షణ భజనలు మరియు పాటలతో కన్నుల పండుగగా భక్తులు నిర్వహిస్తారు. స్వామివారి పాదాల వద్ద భరతనాట్యం కోలాటం మరియు సాంప్రదాయ నృత్యా లతో భక్తులు స్వామివారిని కొలుస్తారు. భారీ వర్షాల వలన కొండ చుట్టూ నీరు ఏర్పడింది. సమీప హెలిప్యాడ్ల చుట్టూ భారీగా వర్షం నీరు చేరింది. వీటన్నిటినీ లెక్క చేయకుండా భక్తులు స్వామి వారి మీద భక్తితో లక్ష్మీ నరసింహ స్వామికి జై అంటూ నినాదాలతో ఆకాశం మిన్నంటేల గిరి ప్రదర్శన పూర్తి చేశారు.