29-08-2025 12:12:30 PM
సహాయక చర్యల ను పరిశీలించిన కలెక్టర్
రెస్యూ టీం సహాయక చర్యలు
అగ్నిమాపక శాఖ, మున్సిపల్ శాఖ సిబ్బంది సేవలు
కామారెడ్డి, (విజయక్రాంతి): కామారెడ్డిని అతలాకుతలం చేసిన వరద బీభత్సం నుంచి ఇప్పుడిప్పుడే కామారెడ్డి(Kamareddy) ప్రజలు కోరుకుంటున్నారు. శుక్రవారం ఉదయం నుంచి జీ ఆర్ కాలనీలో వరద నీరు ఇండ్ల నుంచి వెళ్లిపోవడంతో ఇంట్లో వస్తువులన్నీ బురదమయం గా మారాయి. వాటిని చూసి బాధితులు కన్నీరు కార్చారు. ఇల్లు కాలిన కొన్ని వస్తువులు మిగిలేవి ఇప్పుడు అన్ని బురద మయమయ్యాయి అంటూ బాధితులు రోదించారు. బురద మాయంతో ఉన్న ఇండ్లను అగ్నిమాపక సిబ్బంది, రెస్యూ టీం, మున్సిపల్ శాఖ సిబ్బంది సహాయం చేపట్టారు. తొలగించేందుకు అగ్నిమాపక అధికారులు పక్కనే ఉన్న వరద నీటి కి పైపులు ఏర్పాటు చేసి ఫ్రెషర్ నీటితో ఇండ్లను శుభ్రంగా కడిగారు. మున్సిపల్ శాఖ అధికారులు వాటర్ ట్యాంకర్ లను రంపించి ఇండ్లను క్లీన్ చేయించారు. ఇండ్లలోని వస్తు సామాగ్రి బురదతో ప్లీజ్ లు, బీరువాలు, వాషింగ్ మిషన్లు లలో బురద చిక్కుకొని పనిచేయకుండా పోయాయి.
వంట పాత్రలు, బియ్యము, పప్పు దినుసులు సైతం పాడైపోయాయి. ఇంట్లో ఏ వస్తువు కూడా పనికి రాకుండా పోయిందని బాధితులు వాపోయారు. కలెక్టర్ ఆశిష్ సంఘూ వన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, మున్సిపల్ రెవిన్ ఇన్స్పెక్టర్ రవిగోపాల్ రెడ్డి, రెవెన్యూ అధికారులు సిబ్బంది జి ఆర్ కాలనీ ప్రజలకు సహాయం అందించారు. రెండు రోజులపాటు కొనసాగిస్తేనే జి ఆర్ కాలనీలోని ఉరువాలు క్లీన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వరద బీభత్సంతో అతలాకుతలమైన కామారెడ్డి జి ఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్, కౌండిన్య వరద వచ్చి ప్రజలు ఇబ్బంది పడ్డారు. బాధితులకు టిఫిన్ సౌకర్యం కల్పించడంతోపాటు భోజన వసతి కూడా కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు ఆధ్వర్యంలో జి ఆర్ కాలనీలో పాల్గొని సేవలందించారు. ఇళ్లలోని వస్తువులను బయటకు తీసి పెట్టారు. బాధితులకు అండగా నిలిచారు.