07-08-2025 01:21:17 AM
‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ మున్నా ధూళిపూడి నుంచి వస్తున్న మరో చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ఈ సినిమా కు ట్యాగ్‌లైన్. అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ చిత్రంలో రోహన్ సూర్య, మొయిన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నీలినీలి ఆకాశం క్రియేషన్స్, ప్రశ్వి త ఎంటర్‌టైన్‌మెంట్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం టైటిల్ మోషన్ పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భం గా నిర్వహించిన ప్రెస్‌మీట్‌కు దర్శకులు చందు మొండేటి, శివ నిర్వాణ, కృష్ణచైతన్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు మున్నా మాట్లాడుతూ.. “నేను ఒకరోజు ఉదయం 4 గంటలకు హైదరాబాద్‌లో రోడ్డుపై లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుంటే ఒక అమ్మాయి బండి ఆపి చార్మినర్ దగ్గరకు వెళ్లి చాయ్ తాగుదామా అని అడిగింది.
తను పెళ్లి తర్వాత స్వేచ్ఛ ఉండదని అలా చివరి రోజు ఎంజా య్ చేయడానికి వచ్చానని చెప్పింది. అలాంటి చాలా మంది కథల స్ఫూర్తితో ఈ సినిమా తీశా. బాగా చదువుకున్నవాళ్ల కథ ఇది. అమ్మాయిలను భయంతో పెంచుతాం. ధైర్యంతో పెంచాలని చెప్పే కథ ఇది. అమ్మాయిలను అమ్మోరులా పెంచాలి. స్కూల్లో అమ్మాయిలను తమను తాము కాపాడుకునే సెల్ఫ్ డిఫెన్స్ ఒక సబ్జెక్ట్‌లా పెట్టాలి.. మా మూవీ టీమ్ నుంచి అన్ని రాష్ట్రాల సీఎంలకు, కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా. రేణూ దేశాయ్ ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేశారు” అన్నారు.
‘ఈ సినిమాలో పాటలు, కథ అన్నీ చాలా బాగున్నాయి. బ్యాడ్ గాళ్స్ అంటున్నా కానీ వాళ్లు చాలా బాగా యాక్ట్ చేశారు. ప్రతి ఫ్యామిలీ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నాం’ అని నిర్మాతలు అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, నటులు మొయిన్, సూర్య, కమెడియన్ భద్రం, ఎడిటర్ నాగేశ్వరరెడ్డి, మిగతా చిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.