పింఛన్ ఇప్పించండి.. సారూ..!
10-06-2025 12:49 AM
అంతర్గాం వృద్ధుల ఆవేదన
సిర్గాపూర్, జూన్ 9: సిర్గాపూర్ మండల పరిధిలోని అంతర్గాం గ్రామానికి చెందిన కంట్రపల్లి భద్రవ్వ అనే వృద్ధురాలు సోమవారం కలెక్టరేట్ కు వచ్చి పింఛన్ మంజూరు చేయ్యాలని ప్రజావాణిలో దరఖాస్తు చేసింది. గత రెండేళ్ల కిందట ఆమె భర్త మొగులయ్య మృతి చెందాడు. గతంలో భర్తకు పింఛన్ వచ్చేదని, ఆయన మృతి చెందాక వితంతు పింఛన్ సైతం మంజూరు చేయ్యలేదని ఆమె అన్నారు. పలుమార్లు ఎంపీడీఓకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేసింది. పింఛన్ మంజూరు చేయ్యలని అధికారులను కోరింది.






