తొలిరోజు సత్తాచాటిన తెలంగాణ సెయిలర్లు
10-06-2025 12:50 AM
- హుస్సేన్ సాగర్లో 16వ ఎడిషన్ మాన్సూన్ రెగట్టా ప్రారంభం
ముషీరాబాద్, జూన్ 9 (విజయ క్రాంతి) : హుస్సేన్ సాగర్లో 16వ ఎడిషన్ మాన్సూన్ రెగట్టా సోమవారం ఉత్సాహంగా ప్రారంభమైం ది. మొత్తం ఏడు విభాగాల్లో 127 మంది సెయిలర్లు ఈ పోటీలలో పాల్గొంటున్నారు. తొలి రోజు ఆహ్లాదరకమైన వాతావరణంలో తెలంగా ణ సెయిలర్లు సత్తా చాటారు.
అం డర్-19 మికస్డ్ డబుల్ క్లాస్లో తనుజా కామేశ్వర్, శ్రవణ్లు పూర్తి ఆధిపత్యం చెలాయించారు. తొలిమూడు రేసులనూ గెలుచుకుని అగ్రస్థానంలో నిలిచారు. ఇదే విభాగంలో రాష్ట్రానికే చెందిన దీక్షిత కొమ్మరవెల్లి, గణేష్ పీర్కట్ల రెండో స్థానంలో నిలిచారు. సబ్ జూనియర్ బాలుర విభాగంలో లోకల్ సెయిలర్ రిజ్వాన్ మహమ్మ ద్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి ఆకట్టుకున్నాడు.






