విద్యుత్ షాక్‌తో మేకల కాపరి మృతి
18-07-2026 02:04 AM
బోధన్, జూలై 17 (విజయ క్రాంతి): బోధన్ మండలం కల్దుర్కి గ్రామ శివారు లో శుక్రవారం సాయంత్రం విషాద ఘట న చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎన్నోల సాయిలు (మేకల కాపరి) విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం, శుక్రవారం సాయంత్రం సుమారు 4:30 నుంచి 5:00 గంటల మధ్య సాయిలు గ్రామ శివారులో మేకలను మేపుతున్నాడు.
ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన కబాలి ప్రకాష్ వ్యవసాయ పొలం గట్టు పై నడుచుకుంటూ వెళ్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి, సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్కు చేయి తగలడంతో తీవ్ర విద్యుత్ షాక్కు గురయ్యాడు. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






