calender_icon.png 11 July, 2025 | 2:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడిగడ్డ వద్ద ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి

11-07-2025 12:00:00 AM

85 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

మహదేవపూర్, జులై 10 (విజయ క్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాలేశ్వరం మేడిగడ్డ వద్ద గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువన ఉన్న మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహించడంతో గోదావరికి వరద పోటెత్తుతోంది. దీంతో సరస్వతి పుష్కరాల ఘాట్ వద్ద గోదావరి నీటి ప్రవాహం ఉదృతమైంది.

సరస్వతి పుష్కరాల సమయంలో ఏర్పాటు చేసిన ఘాట్ పై మెట్లు నీట మునిగి, జ్ఞాన బండాగారాలు గ్రంథాల మీదుగా ప్రవహిస్తున్నది. గోదావరి నది ఉప్పోంగి ప్రవహించడంతో దిగువన ఉన్న మేడిగడ్డ (లక్ష్మీ బ్యారేజ్) 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. 6 లక్షల 36 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తుండగా, అంతే ప్రవాహాన్ని మేడిగడ్డ బ్యారేజీ దిగువకు వదులుతున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తగా ఉండాలని తహసిల్దార్ రామారావు కోరారు.