calender_icon.png 11 July, 2025 | 2:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినియోగదారులకు మరింత మెరుగైన విద్యుత్ అందించాలి

11-07-2025 12:00:00 AM

ట్రాన్స్‌కో డైరెక్టర్, చీఫ్ ఇంజనీర్

ఖమ్మం, జులై 10 ( విజయ క్రాంతి):వినియోగదారులకు మరింత మెరుగైన విద్యుత్ అందించాలని ట్రాన్స్కో డైరెక్టర్ (ఆపరేషన్స్) టి. మధుసూదన్, చీఫ్ ఇంజనీర్ రాజు చౌహన్ అన్నారు. గురువారం ఖమ్మంలో జిల్లా విద్యుత్ ఉద్యోగులతో ఎన్పీడీసీఎల్ గెస్ట్ నందు సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినారు. సందర్భంగా జిల్లాలో విద్యుత్ సరఫరా, రెవెన్యూ కలెక్షన్స్, వివిధ పనుల ప్రగతిపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

అనంతరం వారు మాట్లాడుతూ వినియోగదారులకు మరింత మెరుగైన నాణ్యమైన విద్యుత్ అందించాలని, విద్యుత్ అంతరా యాలు తగ్గించాలని, వ్యవసాయ కనెక్షన్లు తర్వాత గతిన మంజూరు చేయాలని, ఫెయిల్ అయిన ట్రాన్స్ఫార్మర్ వెంటనే మార్చాలని, వ్యవసాయ క్షేత్రా లలో దుర్బలంగా ఉన్న లైన్స్, ట్రాన్స్ఫార్మర్ స్ లను వెంటనే మరమ్మత్తులు చేయాలని, వ్యవసాయ బావులకు చెందిన ట్రాన్స్ఫార్మర్స్ ఓవర్ లార్డ్ అయితే కెపాసిటీ పెంచి మార్చాలని ఆదేశించారు.

విద్యుత్ ఉద్యోగులు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని ఎల్సి ఆఫ్ ద్వారా పని చేయాలని, ఆక్సిడెంట్లు బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకొని పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఖమ్మం జిల్లా సూపరిండెంట్ ఇంజనీర్ ఇనుగుర్తి శ్రీనివాస్ చారి, ఎస్సే ఓ జి శ్రీధర్, ఖమ్మం డిఇ నంబూరి రామారావు, ఖమ్మం రూరల్ డి ఈ సిహెచ్ నాగేశ్వరరావు, సత్తుపల్లి డి ఈ ఎల్ రాములు, వైరా డి ఈ శ్రీనివాస్, డి ఈ ఎం ఆర్ టి & కన్స్ట్రక్షన్ బద్రుపవర్, డి ఈ డిపి ఈ వెంకటేశ్వర్లు, ఈ ఈ సివిల్ వెంకటేశ్వర్లు ఏడీలు, ఏఈలు, ఏ ఏ ఓ లు పాల్గొన్నారు.