calender_icon.png 11 July, 2025 | 8:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు భోజనం పెట్టని వార్డెన్ ని సస్పెండ్ చేయాలి

10-07-2025 11:31:55 PM

పిడిఎస్ యు జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి..

సూర్యాపేట (విజయక్రాంతి): జిల్లాలోని ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు భోజనం పెట్టని వార్డెన్ వెంటనే సస్పెండ్ చేయాలని పిడిఎస్ యూ జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి(PDSU District President Pulluri Simhadri) అన్నారు. బుధవారం రాత్రి విద్యార్థులతో కలిసి పిడిఎస్ యూ ఆధ్వర్యంలో హాస్టల్  ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హాస్టల్ విద్యార్థులకు హాస్టల్లో సాయంత్రం సమయంలో భోజనాలు పెట్టడం లేదన్నారు. అదేవిధంగా భోజనం సరిపడ వండకపోవడంతో ఉపవాసం ఉండాల్సివస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కూరలు సైతం ఉండడం లేదని ఎన్నిసార్లు విద్యార్థులు ఫిర్యాదు చేసిన వార్డెన్ పట్టిచుకోవడం లేదన్నారు. హాస్టల్లో మౌలిక వసతులు లేక విద్యార్థిలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు.

విద్యార్థుల తల్లిదండ్రులు రెక్కాడితే డొక్కాని పరిస్థితుల్లో సంక్షేమ హాస్టల్లో చేర్పిస్తే వార్డెన్ విద్యార్థుల పట్ల చవితి తల్లి ప్రేమ చూపిస్తున్నాడు అని ఆరోపించారు. హాస్టల్ కు వార్డెన్ కూడా రాకపోవడంతో విద్యార్థులకు  నాణ్యమైన భోజనం అందడం లేదని ఆరోపించారు. హాస్టల్ కి రాని రవికుమార్ వార్డెన్ ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు వార్డెన్ పై అధికారులు చర్యలు తీసుకోకపోతే జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘ డివిజన్ ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్, యశ్వంత్, ప్రవీణ్ హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు.