07-05-2025 12:38:42 AM
హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి): ఉపాధి హామీ సిబ్బందికి తెలంగాణ ప్రభు త్వం శుభవార్త తెలిపింది. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బందికి మూడు నెలల బకాయి వేతనాలను విడుదల చేసింది. రా ష్ట్రం నుంచి ఈ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్‌అసిస్టెంట్లు, టెక్నికల్‌అసిస్టెంట్లు, ఏపీవోలు మొత్తం 3,200 మందికి చెందిన రూ. 62కోట్ల వేతన బకాయిలు మంగళవారం విడుదలయ్యాయి.
ఈ నిధులు ఇప్పటికే ప లువురు ఖాతాల్లో జమ కాగా త్వరలో అందరికీ జీతాలు అందనున్నాయి. పెండింగ్‌లో ఉన్న మూడు నెలల వేతనాల్లో జనవరికి సం బంధించి రూ. 10.82కోట్లు, ఫిబ్రవరి రూ. 25.59 కోట్లు, మార్చి రూ.25.59 కోట్లను ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసింది. మూడు నెలలకు కలిపి మొత్తం రూ.62.27 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం త్వరలోనే ఏప్రిల్‌కు సంబంధించిన వేతనాలను కూడా అందించేందుకు కసరత్తు చేస్తోంది.
మంత్రి సీతక్కకు ప్రత్యేక ధన్యవాదాలు: ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మోహన్‌రావు
గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉద్యోగుల జీతాలిప్పించిన మంత్రి సీతక్కకు రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మోహన్‌రావు, లింగయ్య, ఇతర నాయకులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వేతనాలు విడుదలైన సందర్భంగా మంత్రి సీతక్కను కలిసి కృతజ్ఞతలు చెప్పారు. నాలుగు నెలల నుంచి జీతభత్యాలు రాక ఇబ్బంది పడుతున్న విషయాన్ని మంత్రి సీతక్క దృష్టి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి నిధులు విడుదల చేయించారని సంతోషం వ్యక్తం చేశారు.
వేతనాల విడుదల కోసం ఆర్థిక శాఖ మంత్రి, సీఎస్, ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేశ్‌కుమార్, పీఆర్ ఆర్డీ కమిషనర్ శ్రీజనకు పలుమార్లు విజ్ఞప్తి చేసి ఎప్పుడూ లేని విధంగా బడ్జెట్ నుంచి రెండు దఫాల్లో రూ.144కోట్లు విడుదల అయ్యేలా చేశారని కొనియాడారు. వేతనాల మాదిరిగానే పేస్కేల్ ఇప్పించాలని కోరామని, మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించినట్టు పేర్కొన్నారు.