calender_icon.png 7 May, 2025 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాక్ పౌరులను తిప్పిపంపాలి

07-05-2025 12:35:10 AM

  1. హైదరాబాద్‌లో ఇంకా పాకిస్థాన్ దేశస్తులు
  2. కేంద్రం ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది
  3. గవర్నర్‌కు ఎంపీ డా. కే లక్ష్మణ్ వినతిపత్రం అందజేత

హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో అక్రమంగా నివసిస్తున్న పాకిస్థాన్ పౌరులను తిప్పి పంపడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని.. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వెంటనే వారిని వారి దేశానికి పంపించేలా చర్య లు తీసుకోవాలని కోరుతూ మంగళవా రం బీజేపీ ఎంపీ డా. కే లక్ష్మణ్ ఆధ్వర్యంలోని నాయకుల బృందం గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మను కలిసి వినతిపత్రం సమర్పించింది.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోందని.. అమాయకులైన భారత పౌరుల ను హతమార్చిందన్నారు. ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్‌లో ఎన్నికలు జరగడం పాకిస్థాన్ ఓర్వలేకపోయిందన్నారు. కశ్మీర్ కళకళలాడుతుంటే కళ్లుమండిన పాకిస్థాన్ దుశ్చర్యకు పాల్పడిందన్నారు.

ఆ దేశంపై కేంద్రం కఠిన చర్యలకు రంగం సిద్ధం చేస్తోందని తెలిపారు. అక్రమంగా నివసిస్తున్న పాకిస్థాన్ పౌరులను గుర్తించి తిప్పిపంపించడంలో తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని తెలిపారు. పాకిస్థాన్‌తో పాటు రోహింగ్యాలు, బంగ్లాపౌరులు హైదరాబాద్‌లో భారీగా ఉన్నారని కానీ ఈ ప్రభుత్వం వారిని తిప్పిపంపడంలో చిత్తశుద్ధితో లేదన్నారు.

దేశంలో ఎక్కడ ఏ ఉగ్రవాద చర్యలు చోటుచేసుకున్నా హైదరాబాద్‌తో లింకులు ఉం టున్నాయన్నారు. కాంగ్రెస్ నాయకులు పాకిస్థాన్ భాష మాట్లాడుతున్నారని..ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఫేల్ కొనుగోలుపై ఎగతాళి చేస్తూ మాట్లాడటం దేశం పట్ల వారికు న్న చిత్తశుద్ధి తెలియచేస్తోందన్నారు. రాష్ట్రం లో ఉన్న పాక్ పౌరులను వెంటనే తిప్పిపంపడంపై డీజీపీతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు.