23-05-2025 09:36:53 AM
-10 గంటలకు ప్రారంభించే వైన్స్ అంతలోపే ఓపెన్
-మూసాపేట్ ప్రధాన హైవేపై ఉన్న కార్తీక్ వైన్స్ ఉదయం 9 గంటలకే ఓపెన్
-సమయపాలన గోడలకు పరిమితం
-పర్యవేక్షణ చేయని ఎక్సైజ్ శాఖ అధికారులు
ముసాపేట : మద్యం ప్రియులు(Alcohol lovers) ఒత్తిడి ఉందో.. వ్యాపారంపై మక్కువ ఉందొ.. తెలియదు గానీ కొందరు మద్యం షాపుల ఓనర్లు పొద్దె కానిస్తలేరు. ఉదయం 10 గంటలకు వైన్ షాపును ఓపెన్ చేసి రాత్రి పది గంటల వరకు వ్యాపారం చేసుకోవాలని ప్రభుత్వా నిబంధన ఉన్నప్పటికీ అవేవీ పట్టనట్లు కొందరు వ్యవహరిస్తున్నారు. కొందరు మద్యం షాప్ యజమానులు ఈ సమయం సరిపోడం లేదన్నట్టు బంద్ చేయవలసిన సమయంలో కూడా ముందుగా ఓపెన్ చేసి తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. మద్యం అమ్మితే చాలు అనట్టు మద్యం షాపులు ఎప్పుడు తెరిచి ఎప్పుడు బంద్ చేసిన ఎక్సైజ్ శాఖ అధికారుల(Excise Department officials) పర్యవేక్షణ అంతంత మాత్రమే ఉందని ఆరోపణలు బలంగా ఉన్నాయి.
-9 గంటలకే కార్తీక్ వైన్స్ ప్రారంభం...
మూసాపేట్ మండల(Moosapet Mandal) పరిధిలో ఉన్న కార్తీక్ వైన్స్ శుక్రవారం ఉదయం 9 దాటితే వెంటనే ఓపెన్ చేయడం జరిగింది. మరో గంట ఆగి ఓపెన్ చేస్తే సరిపోతుంది కదా అని అడిగితే షాప్ లో రిపేర్లు ఉన్నాయి...అందుకే తెరిచామంటూ బుకాయిస్తున్నారు. పొద్దెక్కితే వైన్స్ తెరిచే ఉండేసరికి మద్యం ప్రియులు అటువైపు చూస్తున్నారని, కాస్త ప్రభుత్వం పెట్టిన నిబంధనలు పాటిస్తూ తమ వ్యాపారాన్ని చేసుకోవాలని బాటసారులు కోరుతున్నారు. అవేవి తమకు పట్టవు తమ వ్యాపారం మరో గంట ముందు తెరిస్తే బాగుంటుందని ఆలోచన వచ్చిందో ఏమో ఇలా వారి ఇష్టం సారంగా వారి వైన్ షాపులను తెరిచి వ్యాపారని చేసుకుంటున్నారు.
-నియంత్రణ ఉండాల్సిందే..
ప్రభుత్వ నిబంధనలు అన్ని విషయాలు అమలు చేయాల్సిందని అధికారులు ఎల్లప్పుడూ చెబుతుంటారు. మద్యం షాపులు కొందరు వారి ఇష్టను సారంగా సమయపాలన పాటించకుండా ఓపెన్ చేయడంతో పాటు... బందు చేయడంలో కూడా కొంతమంది నిర్లక్ష్యంగా వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఎక్సైజ్ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపిస్తుందని, మరింత పర్యవేక్షణ చేసి నిబంధనల మేరకు వైన్స్ వినియోగదారులకు అందుబాటులో ఉండేలా చూడాలని పలువురు కోరుతున్నారు.