07-05-2025 12:40:43 AM
- నిర్మాణ అనుమతులు ఉన్నా.. లేవని కొర్రీలు
- పైసలు ఇస్తేనే.. ఇండ్లు, షెడ్ల నిర్మాణాలు
- నోటీసుల పేరుతో అడిగినంత ఇవ్వాలని డిమాండ్
- జీహెచ్‌ఎంసీ అధికారులు, కార్పొరేటర్ల అనుచరుల అక్రమ దందా
ఎల్బీనగర్, మే 6 : అక్రమ నిర్మాణాలను అరికట్టాల్సిన అధికారులు, సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతు న్నారు. నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు చేపట్టేవారికి నో టీసులు ఇచ్చి, కూల్చివేతలు చేపట్టాల్సిన అ ధికారులు... ఆదే నోటీసులను అడ్డం పెట్టుకొని అక్రమ వసూళ్లకు తెరతీస్తున్నారు.
ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఆయా డివిజన్లలో రెసిడెన్షియల్ అనుమతులతో కమర్షియల్ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అనుమతులు జీ + 2, + 3 తీసుకుని అదనపు అంతస్తులు చేపడుతున్నారు. క్షేత్రస్థాయిలో అక్రమ నిర్మాణాలను గుర్తించాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు, చైన్ మన్లు, ఇతర సి బ్బంది కండ్లు మూసుకొని చూస్తున్నారు.
ఎవరైనా అక్రమ నిర్మాణాలపై సమాచారం లేదా ఫిర్యాదు చేస్తే తూతూమంత్రంగా నోటీసులు ఇస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత నిర్మాణాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఎల్బీనగర్ నియోజకవర్గంలో జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది, స్థానిక కార్పొరేటర్ల అనుచరుల వసూళ్ల దందా అడ్డూ అ దుపూ లేకుండా ఉన్నది. డివిజన్ల పరిధిలో నూతన నిర్మాణాలపై నిఘా పెడు తూ నిర్మాణాదారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కొత్తగా ఇండ్లు, షెడ్లు నిర్మించుకునే వారి నుంచి ముక్కు పిండి అందినకాడికి వసూలు చేస్తున్నారు. నిర్మాణాలకు అనుమతులు లే వని బెదిరించి నిర్బంధంగా డబ్బు లు వసూ లు చేస్తున్నారు. వీరికి తోడుగా జీహెచ్‌ఎంసీ సిబ్బంది సైతం అనుమతులు లేవని, సరైన డాక్యుమెంట్లు లేవని నిర్మాణాదారులను బెదిరించి అందినకాడికి డబ్బులు దొచుకుంటున్నారు. జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లా నింగ్ విభాగం సిబ్బందిపై అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని శివారు ప్రాంతాల్లో అనేక నూతన కాలనీలు ఏర్పడుతున్నాయి.
కొందరు అనుమ తులు తీసుకు ని నిర్మాణాలు చేస్తుండగా... మరికొందరు ఆర్థిక, రాజకీయ అండతో అనుమతులు తీ సుకోకుండా చేపడుతున్నారు. ఫిర్యాదుల అ ధారంగా జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్మాణాదారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసులను అడ్డుపెట్టుకుని కొందరు అధికారులు, చైన్ మెన్లు నిర్మాణాదారులను బెదిరిస్తున్నారు. అడిగినంత ఇ వ్వాటలని లేకుంటే నోటీసుల ఆధారంగా ని ర్మాణాలు కూల్చివేతలు చేపడుతున్నారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో చైతన్యపురి, కొత్తపేట, నాగోల్, మన్సూరాబాద్, హయత్ నగర్, వనస్థలిపురం, బీఎన్ రెడ్డి నగర్, చం పాపేట, లింగోజిగూడ, హస్తినాపురం డివిజన్లలో నిబంధనలు పాటించని నిర్మాణాదా రులకు టౌన్ ప్లానింగ్ సిబ్బంది నోటీసులు ఇచ్చారు. అనుమతి పత్రాలు అందజేసినా.... ఏదో అనుమతి లేదని కొర్రీలు పెడుతూ బేరసారాలు చేస్తున్నారు. అడిగినంత ఇస్తే వదిలే స్తున్నారు.. లేదంటే కూల్చివేతలు చేస్తున్నా రు. ఎల్బీనగర్ నుంచి నాగోల్ రోడ్డు, సాగర్ రింగ్ రోడ్డు నుంచి చంపాపేట రోడ్డు ఇరువైపులా అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతు న్నాయి.
వీటిపై అనేక ఫిర్యాదులు చేసినా అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నా రు. చర్యలు తీసుకోవడానికి ముందే నిర్మాణాదారులకు సమాచారం ఇచ్చి, సమయం ఇచ్చి నిర్మాణాలను పూర్తి చేయిస్తున్నారు. ఆ యా డివిజన్లలో నూతన నిర్మాణాలు కొనసాగుతుం డడంతో కార్పొరేటర్లకు చేతినిం డా పని దొరుకుతుంది. కార్పొరేటర్లు నేరుగా కాకుండా తమ అనుచరులను నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతానికి పంపించి, యజమానులతో బేరసారాలు చేయించి, డబ్బు లు వసూలు చేయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఎక్కడా పునాది తీసినా.. రాయి కట్టినా... రేకులు వేసినా... షటర్లు కట్టినా... బ హుళ అంతస్తులు కనిపించినా వెంటనే కార్పొరేటర్ల అనుచరులు, జీహెచ్‌ఎంసీ అధికారులు వాలిపోతున్నారు. మీ నిర్మాణానికి అవసరమైన అనుమతులు లేవని, సరైన డా క్యుమెంట్లు లేవని... మా అండ లేకుండా ఎలా పనులు చేస్తారో చూస్తా? అని బెదిరింపులకు దిగుతారు. కష్టపడి సొంత ఇల్లు ని ర్మించుకుంటే బెదిరింపులపై ఎవరికి చెప్పుకోవాలో తెలియక నిర్మాణదారులు కన్నీళ్ల ను దిగమింగుకుంటున్నారు.
నిర్మాణాదారులకు వీరిని ఎదిరించే ధైర్యం లేక చెప్పినంత ఇస్తున్నారు. బహిరంగంగా కొనసాగుతున్న వసూళ్లపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఇటీవల హయత్ నగర్ లోని లక్ష్మీప్రియ కాల నీలో ఒక నిర్మాణదారుడు నిర్మాణం చేపట్ట గా... అడిగినంత ఇవ్వలేదని చైన్ మెన్ టౌన్ ప్లానింగ్ అధికారుల సాయంతో షెడ్ నిర్మాణాన్ని కూల్చివేయించారు. అనుమతులు తీసుకున్నా.... వేధించడం సరికాదని ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనుమతులు లేకుంటే చర్యలు తప్పవు
హయత్ నగర్ సర్కిల్ పరిధిలో అక్రమ వసూళ్లపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతులు తీసుకుంటే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అన్ని అనుమతులు తీసుకుని, నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టాలి. భవన నిర్మాణ సమయంలో ఎవరైనా బెదిరిస్తే నేరుగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.
డాక్టర్ తిప్పర్తి యాదయ్య, హయత్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్