06-08-2024 01:18:02 PM
Google: ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ తన గుత్తాధిపత్యాన్ని నిలబెట్టుకోవటానికి నిరంతరం ప్రయత్నం చేసిందని అమెరికా కోర్టు తీర్పు స్పష్టం చేసింది. గుత్తాధిపత్యాన్ని నిలబెట్టుకోవటానికి చట్ట విరుద్ధంగా వ్యవహరించిందని తీర్పులో కోలంబియా ఫెడరల్ న్యాయమూర్తి అమిత్ మెహతా తేల్చారు. శాంసంగ్, యాపిల్ తో సహా పలు బడా కంపెనీలతో ఒప్పందాలను చేసుకుని వాళ్ల తాలూకు డివైజ్లలో గూగుల్ సెర్చ్ డీఫాల్ట్ గా తప్పనిసరి చెయ్యటానికి చెల్లింపులు చేసిందని గూగుల్ పై ప్రధాన ఆరోపణ. ఈ మేరకు అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్, మరి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టుని ఆశ్రయించాయి.