06-08-2024 01:25:36 PM
న్యూఢిల్లీ: పలువురు సుప్రీంకోర్టు లాయర్లపై సీజేఐ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కోర్టులు, జడ్జిలపై ఎంత ఒత్తిడి ఉందో అర్థం చేసుకోవాలని సీజేఐ పేర్కొన్నారు. న్యాయవాదులు ఒకరోజు సీజేఐ స్థానంలో కూర్చుంటే తెలుస్తుందని జస్టిస్ డి.వై. చంద్రచూడ్ లాయర్లపై మండిపడ్డారు. ఒక్కరోజు కూర్చుంటే.. మళ్లీ జీవితంలో ఆ స్థానంలోకి రాకుండా పారిపోతారన్నారు. ముంబయి చెంబుర్ కాలేజ్ లో బురఖా, హిజాబ్ రద్దు వ్యవహారంపై విచారణలో సీజేఐ వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరూ తమ కేసు ముందుా విచారణ చేపట్టాలని కోరుతున్నారని జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. జడ్జిలపై ఉన్న ఒత్తిడిని ఎవరూ పట్టించుకునే పరిస్థితుల్లో లేరని అసహనం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క పిటిషన్ పై విచారణ చేస్తాం.. దానికి ఒక తేదీ ఇస్తామని సీజేఐ వెల్లడించారు. అతేగానీ జడ్జిలను, కోర్టును శాసించవద్దని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ కోరారు.