calender_icon.png 1 August, 2025 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీర్​పేట్​లో అదృశ్యమైన బాలుడు క్షేమం

06-08-2024 12:53:50 PM

జిల్లెలగూడ: మీర్​పేట్​లో అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభించింది. రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ పోలీసు స్టేషన్ లోని జిల్లెలగూడలో మిస్సయిన బాలుడిన పోలీసులు తిరుపతిలో గుర్తించారు. ఈనెల 4వ తేదీన ఇంటి నుంచి ట్యూషన్ కు వెళ్లానని చెప్పిన బాలుడు మలక్ పేటలో రైలు ఎక్కి తిరుపతి వెళ్లాడు. ట్యూషన్ కు వెళ్లిన బాలుడు ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల అంత వెత్తికి మీర్ పేట్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమోరాల ద్వారా బాలుడు తిరుపతిలో ఉన్నట్లు గుర్తించారు. ఈ రోజు ఉదయం ఒక వ్యక్తి బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ బాబు తిరుపతిలో ఉన్నాడని చెప్పాడు. బాబుతో వీడియో కాల్ చేసి మాట్లాడించడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. మీర్ పేట్ పోలీసులు బాబు కుటుంబసభ్యులతో కలిసి తిరుపతి బయలుదేరారు.