06-09-2025 12:00:00 AM
గరిడేపల్లి, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): కార్మికులకు నష్టం కలిగించే జీవోలను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కార్మిక సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు పిట్ట గణేష్ డిమాండ్ చేశారు.శుక్రవారం గరిడేపల్లి లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటీ నుంచి కార్మిక వ్యతిరేక విధానాలను తీసుకొస్తుందని ఆరోపించారు. కార్మికులకు నష్టం కలిగించే అనేక జీవోలను కేంద్ర ప్రభుత్వం జారీ చేయటం విచారకరమన్నారు.
ఒక కార్మికుడు చనిపోతే రెవిన్యూ డివిజన్ లేబర్ ఆఫీసులో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేదని,కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దానిని రద్దు చేస్తూ రాష్ట్ర లేబర్ కమిషనర్ పరిధిలో దరఖాస్తు చేసుకోవాలంటూ కొత్త జీవోను తీసుకురావడం ఆందోళన కలిగిస్తుందన్నారు.కార్మికులకు ఇబ్బంది కలిగించే ఈ జీవోను వెంటనే రద్దుచేయాలని ఆయన కోరారు.