calender_icon.png 8 November, 2025 | 8:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూన్ 25ను 'రాజ్యాంగ హత్యాదినం'గా ప్రకటించిన కేంద్రం

12-07-2024 04:50:21 PM

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 25ను 'రాజ్యాంగ హత్యాదినం'గా ప్రకటించింది. ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ 1975 జూన్ న ఎమర్జెన్సీ ప్రకటించారు. ఎమర్జెన్సీ విధించడం ద్వారా ప్రజాస్వామ్య ఆత్మను హత్య చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. ఎమర్జెన్సీ సమయంలో లక్షల మందిని జైళ్లలో పెట్టారని గుర్తుచేశారు. ఎమర్జెన్సీ సమయంలో మీడియా గొంతు నొక్కారని ఆరోపించారు. కేంద్రం నిర్ణయాాన్ని హోంమంత్రి అమిత్ షా ఎక్స్ ద్వారా ప్రకటించారు.