calender_icon.png 1 August, 2025 | 3:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమ పథకాలకు విస్తృత ప్రచారం చేయాలి

31-07-2025 07:08:10 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతిక సారధి బృందాలు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి విస్తృత ప్రచారం నిర్వహించాలని జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారి రాజేంద్రప్రసాద్ అన్నారు. గురువారం సమాచారపౌర సంబంధాల కార్యాలయంలో తెలంగాణ సాంస్కృతిక సారధి జిల్లా అధ్యక్షుడు కంబాలపల్లి సత్యనారాయణ టీం లీడర్లు వెంకన్న గిద్దె రాంనర్సయ్య మెరుగు రవీందర్ గౌడ్ తో కలిసి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా డిపిఆర్ఓ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇండ్లు, మహిళా శక్తి, రైతుబంధు, రైతు భరోసా, రుణమాఫీ, రైతు బీమా గృహజ్యోతి, మహాలక్ష్మి, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరా జలగిరి వికాసం, మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఆరు గ్యారెంటీ పథకాలపై ప్రజలకు అర్థమయ్యే విధంగా క్షేత్రస్థాయిలో ప్రదర్శన రూపాల్లో వివరించాలని కోరారు.