23-01-2026 08:52:54 PM
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): వర్ధన్నపేట నియోజకవర్గం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 46,64 డివిజన్ల పరిధిలోని మడికొండలో శుక్రవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి ఎస్సీ కాలనీ, వెస్ట్ సిటీ, అంబేద్కర్ విగ్రహం, గవర్నమెంట్ స్కూల్, టీఎన్జీవోస్ కాలనీ, సాయి ఆర్కేడ్ కాలనీలలో సుమారు రూ.3 కోట్లతో సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... పలు కాలనీలలోని ప్రజలతో స్థానిక సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబడిన ప్రతి కాలనీ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని అన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజల భాగస్వామ్యంతో మరింత అభివృద్ధి చేసే విధంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆవాల రాధిక రెడ్డి, తొట్ల రాజు యాదవ్, మెట్టుగుట్ట చైర్మన్ పైడిపాల రఘుచందర్, డివిజన్ అధ్యక్షులు వసకుల నాగరాజు, కాంగ్రెస్ శ్రేణులు వీసం సురేందర్ రెడ్డి, బిల్లా రవీందర్, కుర్ల మోహన్, గుర్రం అమర్నాథ్, ప్రభాకర్, అంకుష్, రాజ్ కుమార్, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు దయాకర్, ప్రజలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.