29-10-2025 12:00:00 AM
త్వరలో ప్రారంభంకానున్న 100 పడకల ఆసుపత్రి
ప్రారంభించనున్నసీఎం : ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్, అక్టోబర్ 28: నకిరేకల్ నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతుంది.. నకిరేకల్ పట్టణంలో త్వరలో 100 పడకల ఆసుపత్రి ప్రారంభం కానున్నది. ప్రభుత్వం మెరుగైన వైద్యం ప్రజలకు చేరబోతున్నది. అతి ఆధునిక వసతులు, ల్యాబ్ ,ఎక్స్ రే, స్కానింగ్, ఫార్మసీ, రేడియాలజీ, అంబులెన్స్ ,అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
65 నెం జాతీయ రహదారిపై ఉన్న నకిరేకల్లో 100 పడకల ఆస్పత్రి నిర్మిచడం,నకిరేకల్ ,కట్టంగూర్ ,కేతపల్లి, శాలి గౌరారం మండల ప్రజలకు , రోగులకు ఎంతో ఉపయోగపడనున్నది. ఆస్పత్రి భవనాన్ని త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు. వేగంగా పెండింగ్ లో పనులు పూర్తి చేస్తున్నారు..
30 నుండి 100 పడకలకు
నకిరేకల్ పట్టణంలో ప్రస్తుతం ఉన్న 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని అప్ గ్రేడ్ చేస్తూ 2022 సం,,లో గత ప్రభుత్వం 100 పడకలకు పెంచారు. ఇందుకు తగినట్లుగా కొత్త భవనం నిర్మించేందుకు అప్పటి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ పక్కన జాతీయ రహదారి వెంట ఐదు ఎకరాల స్థలంలో రూ.32 కోట్లతో మూడు అంతస్తులతో 100 పడకల వైద్యశాల భవనాన్ని నిర్మిస్తున్నారు.
గతేడాదే నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నా.. ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడం, నిధులు సకాలంలో అందకపోవడంతో జాప్యం నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రత్యేక దృష్టి సారించి కాంట్రాక్టర్లకు పెండింగ్లో ఉన్న బిల్లులు మంజూరు చేసి పనుల వేగవతం చేయడానికి కృషి చేశారు. పనులు 99% పూర్తి కావస్తున్నాయి. త్వరలో అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. కావలసిన యంత్రాలను పరికరాలను, ఫర్నిచర్ ను సమకుర్చాలని వైద్యవిధాన పరిషత్ అధికారులను ఆదేశించింది.
118 మంది సిబ్బంది మంజూరు
ఇప్పటికే 100 పడకల వైద్యశాలకు సరిపోయే వైద్యులతో పాటు వివిధ రకాల డిపార్ట్మెంట్లకు 118మంది సిబ్బందిని ప్రభు త్వం మంజూరు చేసింది. ఇందులో 74 పోస్టులకు భర్తీ అయ్యారు. 44 పోస్టులు ఖాళీగా ఉన్నాయి . ఇందులో 24 డాక్టర్ పోస్టులు, 7 స్టాఫ్ నర్సులు మరియు సపోర్ట్ సిబ్బంది పూర్తి కావాల్సినది. ప్రారంభమయ్యే నాటికి పోస్టులు భర్తీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి..
ప్రస్తుత 30 పడకల ఆసుపత్రిలోనే అందుబాటులో ఉన్న వైద్య సేవలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 250 నుండి 300 వరకు ఓపి నడుస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రసూతి విభాగం, పిల్లల విభాగం, జనరల్ సర్జరీ, ఆర్థోపెటిక్ ,డెంటల్, వైద్య సేవలు అందిస్తున్నట్లు డాక్టర్స్ చెప్తున్నారు, 100 పడుకుల ఆసుపత్రి అందుబాటులోకి వచ్చిన తర్వాత మరింత వైద్య సేవలు అదనంగా రానున్నాయి. కంటి విభాగం , డయాలసిస్, ఐసియు పిల్లలు, జనరల్ ఫిజీషియన్, రేడియాలజీ మరి కొన్ని అందుబాటులోకి వైద్య సేవలు, డాక్టర్స్ రానున్నారు.
ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం
ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నాం. ప్రతిరోజు 250 నుండి 300 ఒ.పి నడుస్తుంది. త్వరగా వంద పడకల ఆసుపత్రి ప్రారంభమైతే అన్ని రకాల డిపార్ట్మెంట్స్ డాక్టర్స్ అందుబాటులో ఉంటారు .మరింత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేస్తాం.
శోభారాణి, ఇంచార్జి సూపరింటెండెంట్ ప్రభుత్వ ఆసుపత్రి
ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తాం
నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్మించిన 100 పడకల వైద్యశాల భవనాన్ని త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. పలుమార్లు ఆయన ఆస్పత్రి భవనాన్ని పరిశీలించారు.
జరుగుతున్న పనులను క్షుణంగా పరిశీలించారు. జరుగుతున్న లోపాలను గుర్తు చేస్తూ సలహాలు సూచనలు అందిస్తున్నారు. ఆధునిక మెరుగైన వైద్యాన్ని ప్రజలకు అందించడమే ప్రభుత్వ, మా లక్ష్యం అన్నారు.
వేముల వీరేశం, ఎమ్మెల్యే