29-10-2025 12:00:00 AM
కీసర, అక్టోబర్ 28( విజయక్రాంతి) : ఇంజనీరింగ్ విద్యా సంస్థల సహకారంతో పారిశ్రామికరంగాన్ని సాంకేతికంగా మరింత అభివృద్ధి చేసేందుకు చర్లపల్లి పారిశ్రామిక వేత్తల సంఘం ప్రత్యేక చర్యలు తీసుకుంటుం దని చర్లపల్లి పారిశ్రామికవేత్తల సంఘం అధ్యక్షుడు డి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే మోదటిసారిగా చర్లపల్లి పారిశ్రామికవేత్తల సంఘం కీసర మండలం చీర్యాలలోని గీతాంజలి ఇంజనీ రింగ్ కాలేజీతో ఏమయు చేసుకుంది.
సోమవారం చర్లపల్లి పారి శ్రామికవేత్తల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ జీఅర్. రవీందర్ రెడ్డి ఎంఓయుపై సంతకాలు చేసి మార్చుకు న్నారు. ఈ ఎం ఓ యుతో చర్లపల్లి పారిశ్రా మికవాడలోని పరిశ్రమలకు కావాల్సిన మ్యాన్ పవర్ ను, సాంకేతికతను గీతాంజలి కాలేజ్ అందిస్తుంది. దీని కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ ఏర్పాటు చేసి చర్లపల్లి పారిశ్రామిక వాడలోని పరిశ్రమలకు కావలిసిన మ్యాన్ పవర్.
సాంకేతికతను వెబ్‌సైట్‌లో పొందుప రుస్తారు. ఈ వెబ్‌సైట్‌ను గీతాంజలి కాలేజీ విద్యార్థులు నేరుగా చూసి వారికి ఇష్టమైన పరిశ్రమతో పని చేయవచ్చని తెలిపారు. దింతో పరిశ్రమలకు కావాల్సిన మ్యాన్ పవర్‌తో పాటు విద్యార్థులకు ఉద్యోగం లభి స్తుందని తెలిపారు. ఈసందర్భంగా శ్రీని వాసరెడ్డి, రవీందర్ రెడ్డి లు మాట్లాడుతూ ఈ ఎమ్‌ఓయుతో ఇరువురికి ప్రయోజనం కలుగుతుందని రాష్ట్రంలోనే మోదటిసారిగా చర్లపల్లి పారిశ్రామికవేత్తల సంఘం ఎమ యుకు శ్రీకారం చుట్టడం అభినందనీ యమని అన్నారు.
రానున్న రోజులలో ఈ రెండు సంస్థల మధ్య దృడమైన బందం పెరుగుతుందని దీంతో విద్యార్థులకు పారి శ్రామికవేత్తలకు ప్రయోజనం కలుగుతుం దని అన్నారు. కార్యక్రమంలో సీఐఎ సలహ దారుడు జే.నరేందర్ రెడ్డి, గీతాంజలి విద్యాసంస్థల వైన్ చైర్మాన్ ఆర్. హరిచందర్ రెడ్డి, డైరెక్టర్ ఎస్. ఉదయ్ కుమార్. సిఐఏ ప్రతినిధులు సుధాకర్ రెడ్డి. గంగాధర్ బాబు. రాజు. వీర మోహన్. అవినాష్. అనంత్. శివ. లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.