స్మితా సబర్వాల్ పిటిషన్ డిస్మిస్
దివ్యాంగులపై ఆమె వ్యాఖ్యలు వ్యక్తిగతం
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్య దర్శి, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితాసబర్వాల్ దివ్యాంగులపై చేసిన వ్యాఖ్య ల వివాదానికి హైకోర్టులో ముగింపు లభించింది. ఆ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని స్పష్టంచేసింది. సబర్వాల్ మెసే జ్‌తో ఎవరి హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లినట్టు ఆధారాలు లేవని వెల్లడించింది. ఒక అధికారిగా ఆమె ఎవరి రిజర్వేషన్లు తొలగించలేదని నిబంధనలను గుర్తుచేసింది. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలతో దివ్యాంగుల రిజర్వే షన్లు తొలగింపు కూడా సాధ్యం కాదని పేర్కొంది.
స్మితపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను నంబర్ కేటాయింపు దశలోనే హైకోర్టు కొట్టివేసింది. మహారాష్ట్ర కేడర్‌కు చెందిన పూజా ఖేద్కర్ ఫేక్ సర్టిఫికెట్ ఉదంతం నేపథ్యంలో స్మిత సబర్వాల్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు దివ్యాంగ రిజర్వేషన్లపై వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ వేదిక ఆమె చేసిన ఈ వ్యాఖ్యలను తొలగించాలని, దివ్యాంగులపైఐ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు తీసుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త వసుం ధర కొప్పుల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రీ అభ్యంతరాల నేపథ్యంలో ఈ పిటిషన్‌కు నంబర్ కేటాయించలేదు. నంబర్ కేటాయింపుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాస్‌రావు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. భావవ్యక్తీకరణ, వాక్ స్వాతంత్య్ర హక్కు రాజ్యా ంగం ప్రతి ఒక్కరికీ ఇచ్చిందని చెప్పింది. పిటిషనర్ వాదనను ధర్మాసనం తోసిపుచ్చుతూ, పిటిషన్‌ను స్కూటిని దశ లోనే డిస్మిస్ చేసింది.






