calender_icon.png 16 October, 2025 | 1:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేకే ఓసీపీలో దొంగతనానికి యత్నించిన దొంగలు

15-10-2025 10:00:40 PM

పోలీసులకు అప్పగింత..

మందమర్రి (విజయక్రాంతి): ఏరియాలోని కేకే ఓసీపీ స్టోర్స్ లో మంగళవారం ముగ్గురు దొంగలు దొంగతనానికి యత్నించగా, గమనించిన సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది, ఎంటిఎఫ్ టీం దొంగలను పట్టుకొని, పోలీసులకు అప్పగించారు. ఓసిపి స్టోర్స్ దగ్గర దొంగతనానికి ముగ్గురు దొంగలు ప్రయత్నిస్తుండగా గమనించిన ఎంటిఎఫ్ సెక్యూరిటీ గార్డ్ పి సదానందం సంబంధిత అధికారులకు ఫోన్ లో తెలపడంతో ఎంటిఎఫ్ టీం అక్కడికి వెళ్లి స్టోర్స్, ఓసిపి యార్డ్ పరిసర ప్రాంతాల్లో వెతకగా, యార్డ్ లోపల దొంగతనానికి వచ్చిన ఇద్దరు దొంగలను పట్టుకాగా మరొకరు పారిపోయాడు.

అనంతరం ఇద్దరు దొంగలను ఏరియాలోని ఎస్ అండ్ పిసి కంట్రోల్ రూమ్ లో ఉంచి, బుధవారం వారిని పట్టణ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ఈ సందర్భంగా ఏరియా జిఎం కార్యాలయంలో బుధవారం ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ సింగరేణి సెక్యూరిటీ సిబ్బందిని, ఎంటిఎఫ్ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ఓటు జిఎం విజయ్ ప్రసాద్, ఎస్ఎస్ఓ రవి, జూనియర్ ఇన్స్పెక్టర్ బఠారి చంద్రమౌళి, ఇంటెలిజెన్స్ శ్రీనివాస్ రావు, మర్రి శ్రీనివాస్, పురుషోత్తం, సదానందం, గుండం రమణ, చిరుత రఘులు పాల్గొన్నారు.