18-01-2026 06:18:32 PM
తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణం తులసి నగర్ శ్రీ వినాయక దేవాలయం వద్ద నివసించే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అరుణ అదృష్టమయ్యింది. ఆమె భర్త దేవేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బడంగ్ పేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అరుణ సైన్స్ టీచర్ గా విధులు నిర్వహిస్తుందని, గత శనివారం ఉదయం విధులకు వెళ్లేందుకుగాను తాండూర్ నుండి హైదరాబాద్ వెళ్లి ఇమ్లిబన్ బస్ స్టేషన్ నుండి కొంచెం మతిస్థిమితం లేక ఏ బస్సు ఎక్కి ఎటు పోయిందోనని, బంధువులు తెలిసిన వారి వద్ద వెతికిన ఆచూకీ లభించలేదని తెలిపారు. ఆచూకి తెలిసిన వారు +919490269308 నెంబర్ కి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.