calender_icon.png 18 January, 2026 | 8:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ రహదారిపై కారు బోల్తా తప్పిన పెను ప్రమాదం

18-01-2026 06:21:23 PM

కోదాడ: కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట గ్రామం వద్ద కారు బోల్తా పడిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం సంక్రాంతి పండుగ ముగించుకొని విజయవాడ నుంచి తిరుగు ప్రయాణంలో హైదరాబాదు వెళ్తున్న సందర్భంగా దోరకుంట గ్రామం వద్ద హైవేపై కారు అదుపుతప్పి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడటంతో పెద్ద పెను ప్రమాదం తప్పింది. గాయపడిన వారిని వెంటనే అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వారి వివరాలు తెలియాల్సి ఉంది.