01-07-2025 01:28:11 AM
రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ, జూన్ 30 (విజయ క్రాంతి), కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం నెమలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులు, సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించారు. అనంతరం రుద్రూర్ మండల కేంద్రంలో రూ. 48 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రాథమికవేసే సహకార సంఘం గోదాం ను ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో బలోపేతం చేస్తుందన్నారు. రైతులకు అందుబాటులో గోదాముల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, బీర్కూరు బ్ మార్కెట్ కమిటీ అధ్యక్షులు దుర్గం శ్యామల శ్రీనివాస్, రుద్రూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు సంజీవరెడ్డి, నస్రుల్లాబాద్, రుద్రూర్ మండలాల నాయకులు, అధికారులు, నెమలి పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.