01-07-2025 01:26:18 AM
అనారోగ్యంతో అప్పుల పాలైన వారిని ఆదుకుంటాం..
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
నిజామాబాద్ జూన్ 30: (విజయ క్రాంతి): నిజామాబాద్ పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ నిజామాబాద్ అర్బన్ నియోజక వర్గానికి చెందిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) సహాయ నిధి ద్వారా 27 చెక్కులను దాదాపు 16లక్షల రూపాయలు లబ్దిదారులకు పంపిణి చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ నిజామాబాద్ అర్బన్ నియోజక వర్గంలోనీ పలు కాలనీల లోని బాధితులకు సీఎం సహాయ నిధి నుండి నిధులు మంజూరు చేయించడం జరిగింది అన్నారు.
అనారోగ్యంతో అప్పుల పాలైన వారికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తాయి అన్నారు. పేదలకు సహాయంగా అండగా. అనారోగ్య పారినబడి ఆర్థికంగా నష్టపోయిన వారిని ఆదుకుంటామన్నారు నియోజకవర్గ ప్రజల మంచి మాత్రమే కోరుకుంటామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మరియు కొత్త రేషన్ కార్డులు అర్హులకు అందిస్తాం.
ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువగానే అమలు చేస్తున్నాం. రుణమాఫీ చేసి చూపించాం రైతు భరోసా అందిస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం అన్నారు. రాజీవ్ యువ వికాసం పథకముద్వర నిరుద్యోగ యువకులు స్వయం ఉపాధి దక్కుతుందన్నారు