24-05-2025 01:44:29 PM
మహదేవపూర్,(విజయక్రాంతి): సరస్వతి పుష్కరాల్లో(Saraswati Pushkaralu) భాగంగా 10వ రోజున భక్తులతో కిటికీట లాడుతున్న కాలేశ్వరం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న సరస్వతీ పుష్కరాలలో భాగంగా పదవ రోజున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పుష్కర భక్తులు ఉదయం నుండి సరస్వతి పుష్కర ఘాట్ వద్ద స్నానాలు ఆచరించి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శించుకున్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి(Palakurthi MLA Yashaswini Reddy) తన కుటుంబ సభ్యులతో పుష్కర ఘాట్ లో స్నానవాచరించి స్వామివారిని దర్శించుకుని అభిషేకము పూజలు చేశారు.
శివ భక్తులైన (థర్డ్ జెండర్స్) పదవరోజున ఎక్కువ మంది పాల్గొని పుష్కర స్నానం ఆచరించి ఆ శివుని దర్శించుకున్నారు. భక్తులతో కాలేశ్వరం ఎటు చూసినా మినీ కుంభమేళను తలపిస్తుంది. వీకెండ్ కావడంతో ఇంకా ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వర్షం పడి నీళ్ళు నిలిచిన ప్రాంతంలో చిప్స్ వేస్తూ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ కరే ఆధ్వర్యంలో పరివేక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీస్ ఇతర శాఖల సమన్వయంతో పుష్కర ఘాట్ లో గాని పార్కింగ్ స్థలాల్లో గాని ఆలయంలో గాని భక్తుల రద్దీని సమన్వయం చేస్తూ భక్తులకు సకల సౌకర్యాలు అందే విధంగా కృషి చేస్తున్నారు.